కర్నాటక కేసులో ఎంటర్ అయిన రాం జెఠ్మలానీ

Ram Jethmalani enter in to the Karnataka politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరైన సంఖ్యా బలం లేకపోయినా యడ్యూరప్పని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించడంతో కాంగ్రెస్ – జేడీఎస్ లు సుప్రీమ్ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును బుధవారం నాడు ఆశ్రయించింది. అయితే ఈ విషయమై అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు రెండు వర్గాల వాదనలను విన్నది. అయితే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయకుండా ఉండేందుకు స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో గురువారం నాడు ఉదయం పూట యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ… యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో… సీనియర్‌ న్యాయవాది రాం జెఠ్మలానీ ఇంప్లీడ్‌కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్‌ ముందు ప్రతిపాదించాలని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ఆయనకు సూచించింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ… రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.