టాలీవుడ్ దర్శకుడు ఆత్మహత్యాయత్నం

Tollywood Director Rajasimha commits Suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సందీప్ కిషన్ నటించిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ రచయిత, దర్శకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్నిబంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బుధవారం నాడు ముంబైలోని ఆయన ఫ్లాట్‌లో అధిక మోతాదులో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నారు. గత ఏడాదిగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని కెరియర్ పరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు బంధువులు తెలిపారు.

రాజసింహ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కాగా ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా రంగానికి వచ్చారు. ‘ప్రేమించుకుందాం రా’ (1996) చిత్రానికి డైలాగ్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన రాజసింహ… ఆ తరువాత ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దగ్గర ‘బావగారూ బాగున్నారా’ దగ్గర నుండి ‘టక్కరిదొంగ’ వరకూ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అనంతరం ‘మనసంతా నువ్వే’ నుండి శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్ వరకూ పరుచూరి బ్రదర్స్ వద్ద అసోసియేట్ రైటర్‌గా ఆరు సంవత్సరాలు పాటు పనిచేశారు.

అనంతరం 2016లో సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 2016 జూన్ 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఆశించిన స‍్థాయిలో విజయం సాధించకపోవటంతో అవకాశాలు తగ్గాయి. చివరిగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి రైటర్‌గా పనిచేశారు. అది కూడా ఫ్లాప్ టాక్ రావడం వల్ల పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ముంబైకి వెళ్ళిపోయారు రాజసింహ. అక్కడా సరయిన అవకాశాలు లేకపోవడం వల్ల ఆయాన ఏడాది నుండి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలుస్తోంది.