మహా ఛానల్ డీల్ లో టీడీపీ మాజీ ఎంపీ, తాజా ఎమ్మెల్యే?

Ram Mohan Rao and Sambashivarao To Handle Mahaa Tv

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు గడువు కన్నా ముందే వస్తాయని ఎప్పుడైతే ప్రచారం మొదలైందో పొలిటికల్ సర్కిల్స్ లో స్పీడ్ పెరిగింది. ఏదో రకంగా పార్టీ టికెట్, పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మామూలుగా అయితే ఎన్నికల టైం లో పొలిటికల్ లీడర్స్ మీడియా లో తమ గురించి బాగా రావాలని ట్రై చేస్తుంటారు. అయితే రానురాను ఆ ట్రెండ్ బదులు తామే మీడియా ఓనర్స్ అయితే బెటర్ అనే ట్రెండ్ మొదలైంది. ఐ. వెంకటరావు, సుజనా చౌదరి వంటి ఉద్దండ పిండాలు కూడా మహా న్యూస్ ఛానల్ ని లాభాల బాట పట్టించలేకపోయారు. అయినా ఇప్పుడు ఎన్నికల ఏడాది కాబట్టి ఆ ఛానల్ చేయి మారడం వెనుక ఇద్దరు టీడీపీ నాయకులు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావు అయితే ఇంకొకరు తాజా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అని తెలుస్తోంది.

నష్టాల్లో నడుస్తున్న మహా న్యూస్ ఛానల్ ని ఓ nri తీసుకుని విజయవాడ కేంద్రంగా దాన్ని నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పైకి వార్తలు వస్తున్నాయి. కానీ లోపాయికారీగా ఆ ఇద్దరు నేతలు మహా ని నడిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ABN మూర్తి ఈ కొత్త టీం కి తోడు అయినట్టు తెలుస్తోంది . ఇక నిర్వహణ వ్యవహారాలు చూసేందుకు పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు తరపు మనిషి ఇప్పటికే ఛానల్ లో చేరిపోయారు. ఇక సుజనా వల్లే తనకు కేంద్రమంత్రి పదవి, చివరకు ఎంపీ పదవి కూడా రాకుండా పోయిందని భావించే కంభంపాటి అదే సుజనా ని నష్టాల పాలు చేసిన మహా టీవీని వెనకుండి నడిపించడానికి ముందుకు రావడం పార్టీ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం సుజనా వల్ల కానిది తన వల్ల అవుతుందని చూపడంతో పాటు మీడియా చేతుల్లో ఉంటే రాజకీయంగా కూడా వెసులుబాటు ఎక్కువని కంభంపాటి భావించడమేనంట. ఇక యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా రాజకీయంగా దన్నుగా వుంటుందనే మీడియా రంగాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. విజయవాడలో జనవరి 26 న మహా టీవీ పునః ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.