ఊర మాస్ లుక్ తో అలరించిన రామ్ పోతినేని!

Ram Pothineni entertained with the look of the mass!
Ram Pothineni entertained with the look of the mass!

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి . మూవీ ఫలితంతో సంబంధం లేకుండా, హీరోలని మాస్ గెటప్స్ లో చూపిస్తూ, ఆడియెన్స్ ని ఆకట్టుకుంటారు. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ మూవీ ని చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 15 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా సినిమా లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Ram Pothineni entertained with the look of the mass!
Ram Pothineni entertained with the look of the mass!

మూవీ రిలీజ్ కి ఇంకా 15 రోజులే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. రామ్ పోతినేని లేటెస్ట్ స్టిల్ ని రిలీజ్ చేయగా, ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఊర మాస్ స్వాగ్ తో రామ్ ఆకట్టుకుంటున్నారు. సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఈ స్టిల్ కొద్ది సేపటికే వైరల్ గా మారుతుంది . ఇక ఈ మూవీ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.