Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో రామ్, అనుపమ పరమేశ్వరన్ల జంటకు మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం రామ్ ‘నేను లోకల్’ చిత్రంతో సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు త్రినాధ్ నక్కిన దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్‌రాజు బ్యానర్లో రూపొందబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేయడం జరిగింది. మొదట ఈ ప్రాజెక్ట్‌కు సాయి పల్లవి లేదా పూజా హెగ్డేలను దిల్‌రాజు భావించాడు. అయితే వారిద్దరు కాకుండా అనుపమ పరమేశ్వరన్ అయితే కథకు సరైన న్యాయం చేస్తుందనే అభిప్రాయంతో రామ్‌కు అనుపమతో ముడి పెట్టాడు.
గత సంవత్సరం సూపర్ హిట్ అయిన దిల్ రాజు ‘శతమానంభవతి’ చిత్రంలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంతో దిల్‌రాజు బ్యానర్‌కు అనుపమకు మంచి రిలేషన్ ఏర్పడటం జరిగింది. ఇక రామ్‌తో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంతో సక్సెస్ కాంబో పేరు దక్కించుకుంది. అందుకే దిల్‌రాజు బ్యానర్లో రామ్ హీరోగా చిత్రం అనగానే అనుపమ వెంటనే ఒకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి ఇదే సంవత్సరం దసరా లేదా దీపావళికి సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో సక్సెస్ రిపీట్ అవుతుందనే నమ్మకం చిత్ర యూనిట్ సభ్యుల్లో వ్యక్తం అవుతుంది.