హిట్‌ టాక్‌ వచ్చినా ఫ్లాప్‌ కలెక్షన్స్‌

ram-vunnadhi-okate-zindagi-distributors-loss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘నేను శైలజ’ చిత్రం సక్సెస్‌ తర్వాత రామ్‌, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. సైలెంట్‌గా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల సమయంలో కాస్త హడావుడి చేసి విడుదల చేశారు. విడుదలై వారం రోజు అయ్యింది. సినిమా విడుదలవ్వగానే పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. స్నేహం గురించి బాగా చూపించారు అని, స్నేహంకు ప్రేమకు మద్య ఉండే కొన్ని సీన్స్‌ యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అంటూ రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కాని సినిమా మాత్రం కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అయ్యింది. విడుదలైన వారం రోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. కనీసం బడ్జెట్‌ను కూడా రికవరీ చేసే పరిస్థితి లేదు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ram-pothineni-vunnadhi-okat

పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్న ఈ సినిమా ఖచ్చితంగా 20 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబడుతుందని, నిర్మాతకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను మిగుల్చుతుందని భావించారు. కాని తీరా ఫలితం చూస్తే మొదటి వారం రోజుల్లో ఇప్పటి వరకు కనీసం 12 కోట్లు కూడా రాబట్టింది లేదు. పెట్టుబడి కూడా ఇంకా రాబట్టలేక పోయిందని డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాన్ని యూత్‌ ఆడియన్స్‌ ఆధరిస్తున్నప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్‌ మాత్రం ఎక్కువగా ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం వైపుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని ఏరియాల్లో కలుపుకుని ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ఏకంగా 55 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది.

ram-pothineni-vunnadhi-okat

రామ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ మరియు లావణ్య త్రిపాఠిు హీరోయిన్స్‌గా నటించారు. రామ్‌ రెండు విభిన్న గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా కథ ఉందని టాక్‌ వచ్చింది. కాని కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన విధంగా రాకపోవడంతో రామ్‌ తీవ్ర నిరాశలో ఉన్నాడు. మొదటి సారి రామ్‌ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు. పెదనాన్న స్రవంతి రవికిషోర్‌తో కలిసి రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు.