వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజు పాటు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ సమయంలో అక్కడకు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు అక్కడకు వచ్చారు. జగన్కు ఆశీస్సులు అందించారు. అయితే, రమణ దీక్షితులు పులివెందుల వచ్చి మరీ జగన్ను కలవటం యనతో సమావేశం అవ్వటం వెనుక అసలు విషయం ఏంటనే ఆసక్తి మొదలైంది. ప్రజా దర్బార్లో పార్టీ నేతలతో సమావేవమైన సమయంలో వచ్చిన ఆయనకు జగన్ స్వాగతం పలికారు. ఆయన జగన్కు దీక్షితులు ఆశీస్సులు అందించారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. జగన్ అధికారంలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కొద్ది రోజులుగా టీడీపీ ప్రభుత్వానికి..ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేక కామెంట్లు చేసిన రమణ దీక్షితులు పులివెందులకు వచ్చి మరీ జగన్తో సమావేశమయ్యారు. రమణ దీక్షితులను ఆయన పదవి నుండి టీటీడీ తప్పించింది. అప్పటి నుండి టీటీడీలో అనేక అంశాలు..ప్రభుత్వ నిర్ణయాల పైనా రమణ దీక్షితులు బహిరంగంగానే ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు ఫలితాల ముందు జగన్ను కలవటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.