డబ్బు తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రమణ దీక్షితులు !

Ramana deekshitulu caught red handed while misusing annadanam funds

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజులుగా తిరుమల వెంకన్న సన్నిధి ఆభరణాల విషయాల్లో కొన్ని వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మీదా తెలుగుదేశం ప్రభుత్వం మీదా తిరుమల ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆలయ ఈవో వాటి పై వివరణ ఇచ్చారు. అయితే వెంకన్న ఆలయం మ్మెద లేనిపోని అభాండాలు వేసి ఆలయ చరిత్రకు మచ్చ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ రమణ దీక్షితులు మీద టీటీడీ ప్రస్తుత ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు. గతం లో ఆయనతో కలిసి పనిచేసిన వారు అయితే ఆయన నిజ స్వరూపం బయట పెడుతున్నారు.

ఆలయ ఉద్యోగుల్లో రమణ దీక్షితులే అత్యంత అవినీతిపరుడని టీటీడీ మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి బీవీ రమణకుమార్‌ ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపికైంది. 2008లోనే తాను ఈ మేరకు అధికారికంగా నివేదిక ఇచ్చిన సంగతి ఆయన ప్రస్తావిస్తున్నారు. రు.5లక్షల మేరకు అన్నదానం కోసం ఇచ్చిన విరాళాన్ని రమణదీక్షితులు సొంత ఖాతాకు మళ్లించారని ఇదే విషయం సాక్ష్యాధారాలతో తాను నిరూపించానని రమణకుమార్‌ అంటున్నారు. కానీ అప్పుడు ప్రధాన అర్చకుడి విషయం బయటకు పొక్కితే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించారని అందుకే ఆయనను మందలించి వదిలేశారని ఆయన తెలిపారు.

అలాగే వెంకన్న సన్నిధిలో అక్రమాలు జరిగాయంటూ రమణదీక్షితులు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని టీటీడీ మాజీ న్యాయ సలహాదారు వికాస్‌ బన్సోడే కూడా ప్రకటించారు 2008-2010 మధ్య టీటీడీకి న్యాయసలహాదారుగా వ్యవహరించిన బన్సోడే శుక్రవారం ఒక తెలుగు చానెల్ తో మాట్లాడారు. రమణదీక్షితులు రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకోవడం, వ్యాపారుల కోసం నిబంధనలకు విరుద్ధంగా పూజలు నిర్వహించడం తనకు తెలుసునని అన్నదానం కోసం వచ్చిన దాదాపు రూ.పది లక్షల విరాళాన్ని ఆయన తన సొంత ఖాతాకు మళ్లించినప్పటికీ అది బయటపడితే ఆలయానికే అప్రతిష్ట అని టీటీడీ క్షమించి వదిలేసింది అని ఆయన పేర్కొన్నారు.