బిగ్‌బాస్‌ 2కు ముహూర్తం ఫిక్స్‌

BIgg Boss Telugu Season 2 starts on June 16

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2కు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. గత సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే. అయితే ఈసీజన్‌కు ఆయన అందుబాటులో లేకుండా పోయాడు. దాంతో నానిని హోస్ట్‌గా స్టార్‌ మా నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. నానిని ప్రేక్షకులు మొదట అంగీకరించరేమో అనే అనుమానాలు కలిగాయి. కాని హోస్ట్‌ అన్నా కూడా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేయకుండా షోను షురూ చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ షో ప్రసారం చేసేందుకు డేట్‌ను ఖరారు చేయడం జరిగిందట.

స్టార్‌ మా వర్గాల వారి నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ షోను జూన్‌ 16 నుండి ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే షో కోసం పార్టిసిపెంట్స్‌ ఎంపిక జరిగిపోయింది. ఇక ఈసీజన్‌లో మొదటిసారి సామాన్యులకు కూడా అవకాశం ఇస్తున్నారు. దాంతో ఈ షోపై అందరికి ఆసక్తి ఉంది. ఆడిషన్స్‌ నిర్వహించిన స్టార్‌ మా 20 మంది సామాన్యులను ఎంపిక చేయడం జరిగింది. మళ్లీ వారిలోంచి 5 మంది సభ్యులను ఎంపిక చేయబోతున్నారు. వారం రోజుల్లో ఆ పక్రియ పూర్తి కాబోతుంది. ఇక సెలబ్రెటీల ఎంపిక కార్యక్రమం చాలా రహస్యంగా జరుగుతుందని, స్టార్‌ మాలో అతి కొద్ది మందికి మాత్రమే ఆ విషయాల గురించి తెలుస్తున్నాయంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను మరింత మసాలా దట్టించి చూపించేందుకు రంగం సిద్దం అయ్యింది.