హమ్మయ్య…హైదరాబాద్ కి నిపా రానట్టే !

Two hyderabad joined in hospital is out of Nipah Virus

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేర‌ళ ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసిన నిపా వైర‌స్ హైద‌రాబాద్ లో కూడా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఇటీవ‌ల కేర‌ళ‌లో గ‌బ్బిలాలు వ‌ల్ల నిపా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. దీంతో ఒక్క‌కేర‌ళ‌లోని ఈ వ్యాధిసోక‌డంతో 10 మందికి మృత్యువాతపడ్డారు. ఇప్ప‌డిదే వైర‌స్ హైద‌రాబాద్ కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు సోకిస‌న‌ట్లు అనుమానాలు వ్య‌క్తమ‌య్యాయి. కేర‌ళ‌లో నిపా సోకిన ప్రాంతానికి వంద‌ల కిలోమీట‌ర్ల ప్రాంతంలో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు హైద‌రాబాద్ వ‌చ్చారు. అయితే వారికి నిపా సోకిన‌ట్లు అనుమానం రావడంతో వారి బ్ల‌డ్ శాంపిల్స్ ను నిజ‌నిర్ధార‌ణ‌కోసం పూణేలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ విభాగానికి నిన్న పంపించారు.

అయితే ఆ భయంకర నిపా లక్షణాలతో నిమ్స్, ఫీవర్ ఆసుపత్రుల్లో చేరిన ఇద్దరు వ్యక్తులకు నిపా సోకలేదని వైద్యులు నిర్థారించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో బాధపడుతూ ఇద్దరు వ్యక్తులు ఫీవర్, నిమ్స్ లో చేరారు. వీరికి నిపా సోకిందన్న అనుమానంతో.. వారిని ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించండంతో పాటు వీరిద్దరి రక్త, మూత్ర నమూనాలను పూణేలోని ల్యాబ్ కు పంపించారు. ఆ శాంపిల్స్ ను పరిశీలించిన ల్యాబ్ అధికారులు.. నివేదికను హైదరాబాద్ కు పంపారు. ఆ రిపోర్టుల్లో వీరిద్దరికి నెగిటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేరళను వణికిస్తోన్న నిపా వైరస్ జాడలు హైదరాబాద్ లో కనిపించినట్లు వార్తలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. నిమ్స్, ఫీవర్, నీలోఫర్, వరంగల్ ఎంజీఎంలలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది