Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1974 లో ఈనాడు ఏర్పాటు అయినప్పటినుంచి క్రమక్రమంగా ఆ పత్రిక వృద్ధి చెందుతూ వచ్చింది. కొన్నేళ్లలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికీ సర్క్యూలేషన్ పరంగా తెలుగు లో ఈనాడుదే ప్రధమ స్థానం. మొదట ఉదయం, తర్వాత వార్త, ఆపై సాక్షి రూపంలో ఈనాడుకు గట్టి పోటీదారులు దొరికారేమో గానీ ఏ ఒక్కరూ ఈనాడుని దాటలేకపోయారు. ఈ పోటీ ఎప్పటికప్పుడు ఈనాడు అలెర్ట్ గా ఉండటానికి దోహదం చేసింది. లాభనష్టాలు ఎంత అన్న విషయం పక్కనబెడితే నేడు ఇంతగా ఎదిగిన రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి వెన్నుముక ఈనాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి ఈనాడు ఇప్పుడు వెబ్ సైట్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతి కన్నా వెనుకపడిపోయింది. అలెక్స రాంక్ ప్రకారం ఆంధ్రజ్యోతి వెబ్ ఫార్మటు లో ఈనాడు ని దాటేసింది.
40 ఏళ్ల తెలుగు జర్నలిజం చరిత్రలో ఈనాడు ఏ ఫార్మటు లో అయినా ఇలా వెనుకపడటం బహుశా ఇదే తొలిసారి అయ్యుంటుంది. ఇదే విషయం మీద ఇప్పుడు ఈనాడు సంస్థల అధినేత రామోజీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈనాడు వెబ్ సైట్ ని జనంలోకి కంటెంట్ పరంగా, టెక్నికల్ గా ఇంకా ఉన్నత ప్రమాణాలతో తీసుకెళ్లే విషయం పై శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ విషయం మీద ప్రస్తుతం ఈనాడులో చర్చల మీద చర్చలు, ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. భవిష్యత్ లో ప్రింట్ కన్నా ఆన్ లైన్ న్యూస్ కే ప్రాధాన్యం పెరగబోతుందన్న విషయం కూడా ఈనాడు సంసిద్ధతకి ఇంకో కారణం. పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాలు మార్చుకోవడం సహజమే అయినా ఈసారి ఆంధ్రజ్యోతి కారణంగా ఈనాడు కి ఈ పరిస్థితి రావడం కాస్త చిత్రమే.