వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా కూడా బుల్లితెరపై కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు. ఒక ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే ‘నెం.1 యారి’ అనే కార్యక్రమానికి హోస్ట్‌గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన ప్రతిభ అంతా ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే రానా తన టాలెంట్‌తో మొదటి సీజన్‌ను విజయవంతం చేశాడు. రెండో సీజన్‌లో రానా తాజాగా ‘సవ్యసాచి’ టీం తన కజిన్ నాగచైతన్య, నిధి అగర్వాల్, దర్శకుడు చందూ మొండేటిలతో కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో తన కజిన్ ను ఒక ఆట ఆడేసుకున్నాడు. పెళ్లైన చైతూని తికమక పెట్టే విధంగా ప్రశ్నలు వేస్తు చాలా ఫన్నీ జవాబులను రప్పించాడు. మొత్తానికి దర్శకుడితో సహా అందరు కూడా చైతూతో ఆడేసుకున్నట్టు తెలుస్తోంది.
అమ్మాయిల విషయంలో చైతూ ఎలా ఉంటాడు, ఇక అమ్మాయిలు అనగానే గుర్తుకు వచ్చే పాయింట్ ఏది అంటూ చైతూని ఆడేసుకున్నాడు. సమంత రోజుకు ఎన్ని సార్లు కాల్ చేస్తుంది అని అడుగుతూ రచ్చ రచ్చ చేశారు. దాదాపు సీక్రెట్స్ అన్ని కూడా బయటకు లాగేశారు అని చెప్పవచ్చు. దానికి తోడు దర్శకుడు చందూ మొండేటి కూడా సీక్రెట్స్ లీక్ చేశాడు. మొత్తానికి తాజా ఎపిసోడ్‌లో చైతూ, రానాలు తెగ సందడి చేసినట్టు తెలుస్తోంది. అసలే రానా ఎంత చిలిపి అనే విషయం అందరికి తెలుసు. అదీ కాకుండా తన కజిన్ ఈ షోకు వెళితే ఊరుకుంటాడా? గుట్టు అంతా బయటకు లాగడు. రానా తనదైన స్టయిల్‌లో, తన ప్రతిభతో ఆకట్టుకుంటాడు కాబట్టే ఈయనకు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ తో కలిసి పనిచేసే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రానా చిలిపి వేశాలతో సీజన్ 2ను విజయవంతం చేసేలా ఉన్నాడు.