తమిళ్ జెర్సీ హక్కులు కొన్న రానా…హీరోగా విశాల్ ?

rana purchased tamil jersey rights

నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే ఇది నాని కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అని చెప్పచ్చు. అంత పేరు తెచ్చుకుంది కాబట్టే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దిల్ రాజు – అరవింద్ లాంటి వాళ్ళు సిద్దం అవుతున్నారు. అయితే ఈ సినిమాని తమిళ్ లో కూడా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌ రైట్స్‌ను హీరో రానా దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో రానా నటిస్తున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన నిర్మాతగా ఆ సినిమా నిర్మించానున్నర్ని అంటున్నారు, హీరో విష్ణు విశాల్ తమిళ జెర్సీ హీరోగా నటించనున్నారని అంటున్నారు. నిజానికి రానా హీరోగా నటిస్తున్న ‘హాథీ మేరీ సాథీ’ అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాలో విష్ణు విశాల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు తమిళ బాషలలో ఆయన చేస్తున్నా, హిందీ వెర్షన్‌ లో మాత్రం విష్ణు విశాల్‌ పాత్రను ఓ హిందీ నటుడు పోషిస్తున్నారు. అయితే ఈ షూట్ లో ఏర్పడిన పరిచయంతో రానా ఈ రిస్క్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.