వెబ్ సిరీస్ లో రానా

Rana to do web series

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

సినిమా, టీవీ త‌ర్వాత ఇప్పుడు ప్ర‌జ‌ల‌పై విప‌రీత ప్ర‌భావం చూపుతోంది డిజిట‌ల్ మీడియా.  సినిమాల‌కు, టీవీ కార్య‌క్ర‌మాల‌కు ప్రేక్ష‌కులున్న‌ట్టే డిజిటల్ మీడియాకు ఇప్పుడు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఊహించ‌ని రీతిలో పెరుగుతోంది. అందుకే ప‌లు నిర్మాణ సంస్థ‌లు  డిజిట‌ల్ మీడియాపై దృష్టిపెట్టి వెబ్ సిరీస్ లు మొద‌లుపెట్టాయి. ఈ మ‌ధ్య కాలంలో వెబ్ సిరీస్ హ‌వా బాగా పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టే చిన్న స్థాయి న‌టీన‌టులే కాకుండా సినిమా, టీవీ రంగాల్లో అగ్ర‌స్థానంలో ఉన్న న‌టీన‌టులు కూడా ఈ వెబ్ సిరీస్ లో భాగం అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

తాజాగా భ‌ల్లాల‌దేవుడు రానా కూడా వెబ్ సిరీస్ లో న‌టించేందుకు అంగీక‌రించారు. వియూ సంస్థ నిర్మిస్తున్న సోష‌ల్ అనే వెబ్ సిరీస్ లో రానా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మ‌రో న‌టుడు న‌వీన్ క‌స్తూరియా కూడా క‌నిపించ‌నున్నారు. రానా వియూ సంస్థ‌లో ఇప్ప‌టికే నెం 1. యారీ అనే టాక్ షో చేస్తున్నారు. ఇక ఇప్పుడు వారి నిర్మాణలోనే వెబ్ సిరీస్ లోనూ న‌టించ‌నున్నారు. సోష‌ల్ పేరుతో తీస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సోష‌ల్ మీడియాకు విప‌రీతంగా అల‌వాటు ప‌డిన యువ‌త‌రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లే ప్ర‌ధాన క‌థాంశం. అందుకే దీనికి సోష‌ల్ అని పేరుపెట్టారు. సెప్టెంబ‌రు మొద‌టి వారంలో ఈ సిరీస్ మొద‌టి ఎపిసోడ్ ను వియూ వెబ్ చాన‌ల్ లో ప్ర‌సారం చేయ‌నున్నారు.

కెరీర్ ఆరంభం నుంచి విభిన్నరీతిలో ముందుకు పోతున్న రానా…ఇప్పుడు  ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నారు. శాటిలైట్ చాన‌ళ్లు వ‌చ్చిన కొత్త‌లో వెండితెర న‌టీన‌టులు బుల్లితెర‌పైకి రావ‌టానికి ఎంతో భ‌య‌ప‌డ్డారు. కానీ త‌ర్వాత కాలంలో విభ‌న్న కార్య‌క్ర‌మాలు చేస్తూ వారే బుల్లితెర‌పై సంద‌డి చేశారు. అయితే టీవీ కార్య‌క్ర‌మాల్లో క‌నిపించ‌టానికి  తొలినాళ్ల‌లో సందేహించిన‌ట్టుగా ఇప్పుడు డిజిట‌ల్  మీడియా వైపు వ‌చ్చేందుకు న‌టీన‌టులెవ‌రూ వెన‌కాడ‌టం లేదు.  ప్ర‌స్తుతం బుడి బుడి అడుగులు వేస్తున్న డిజిట‌ల్ మీడియా రానున్న రోజుల్లో ప్ర‌భంజ‌నంలా మార‌నుందని సెల‌బ్రిటీలు స‌హా అంతా భావిస్తున్నారన్న‌మాట‌

మరిన్ని వార్తలు:

మహేష్‌కు రజినీ సాయం?

బిగ్ బాస్ లో వారిద్దరికి నవదీప్‌ చెక్‌

‘జై లవకుశ’ ఆడియో డేట్‌ ఫిక్స్‌