బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో త్వరలో ఒక్కటవుతారని బాలీవుడ్‌లో ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో రణ్‌బీర్, అలియా మ్యారేజ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. స్టార్ జంట వివాహానికి రిహార్సల్స్ కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.
అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని కపూర్ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. ఈ ఏడాది వివాహ వేడుక లేదని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే శుభకార్యంపై స్పష్టత వస్తుందని కపూర్ కుటుంబ సభ్యులు ఒకరు వెల్లడించారు. రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించారని, దీంతో 2021 ద్వితీయార్ధం వరకూ పెళ్లి ఊసే ఉండదని పేర్కొన్నారు.మరోవైపు వివాహంపై రణ్‌బీర్, అలియా సానుకూలంగా ఉంటే నీతూజీకి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని చెప్పుకొచ్చారు. అసలు రణ్‌బీర్, అలియా భట్‌లో ఏ ఒక్కరూ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నారు. వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు చాలా సమయం పడుతుందని తేల్చేశారు.