బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ఒక వైలెంట్ హిట్ “అనిమల్” తర్వాత చేస్తున్న పీరియాడిక్ భారీ మూవీ నే “రామాయణం”. దర్శకుడు నితీష్ తివారి కలయికలో స్టార్ట్ అయ్యిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ లో రామునిగా రణబీర్ నటిస్తుండగా హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నాడు . మరి మొదటి నుంచీ మంచి ఎగ్జైట్మెంట్ ఉన్న ఈ మూవీ రిలీజ్ పై ఫైనల్ గా బాలీవుడ్ నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది.
మరి ఈ మూవీ ని రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. మొదటి భాగాన్ని ఏకంగా 2026 దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే రెండో భాగాన్ని ఆ మలి ఏడాది 2027 దీపావళి కానుకగా అయితే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో రానున్న వరుస రెండేళ్లు దీపావళి రేస్ ను బాలీవుడ్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ చేసుకుంది అని చెప్పాలి. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.