సంక్రాంతికి సర్‌ప్రైజ్‌ చేయనున్న చరణ్‌?

rangasthalam 1985 teaser release on sankranthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి చివరకు మార్చి 30వ తారీకున విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఆ తేదీకి ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల ఖాయం అంటూ మైత్రి మూవీస్‌ నిర్మాతలు అంటున్నారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇటీవలే విడుదలైన చరణ్‌ ఫస్ట్‌లుక్‌ మాస్‌ ఆడియన్స్‌తో విజిల్స్‌ వేయించే విధంగా ఉంది. లుంగీలో చరణ్‌ మాస్‌ లుక్‌ అదిరిందని, సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో టీజర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ram-charan

చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తిగా ఒక పల్లెటూరు కుర్రాడిగా కనిపించబోతున్నాడు. పాత్ర గురించి ఒక క్లారిటీ రాకుండా, పాత్రపై మరింత ఆసక్తిని కలిగించేలా, ఒక సింపుల్‌ డైలాగ్‌తో టీజర్‌ను రెడీ చేయాల్సిందిగా క్రియేటివ్‌ టీంకు సుకుమార్‌ సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్‌ కట్‌ చేసేందుకు ఒక టీం చాలా కృషి చేస్తుంది. సంక్రాంతికి ఆ టీజర్‌ను విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త సంవత్సరంకు అటు ఇటుగానే టీజర్‌ను రెడీ చేసి దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని సరి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.

ram-charan-new-movie

సంక్రాంతికి పవన్‌ అజ్ఞాతవాసి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో పాటు మొదటి రెండు రోజులు థియేటర్లలో రంగస్థలం టీజర్‌ను ప్రసారం చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రంగస్థలం టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేసి, ఆడియోను మరియు ట్రైలర్‌ను ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ఆరంభంలో విడుదల చేయబోతున్నారు. చరణ్‌ కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని, సమంత కూడా మునుపెన్నడు కనిపించని విధంగా చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్‌ అయిన ఫొటోలను బట్టి అర్థం అవుతుంది.