‘రంగస్థలం’ సెన్సార్‌ రివ్యూ

Rangasthalam Movie Censor Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేయడం జరిగింది. ఇక అంతా భావిస్తున్నట్లుగానే ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు నుండి చాలా పాజిటివ్‌ టాక్‌ను చెప్పారు. సెన్సార్‌ బోర్డు నుండి ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్సాన్స్‌ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ నటనతో పాటు, సమంత పాత్ర మరియు సుకుమార్‌ టేకింగ్‌ మరియు స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది అంటూ సెన్సార్‌ బోర్డు వారు కితాబిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మద్య కాలంలో ఇలాంటి చిత్రం రాలేదని, ఖచ్చితంగా ఇదో ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రం అవుతుందనే నమ్మకంను సెన్సార్‌ బోర్డు సభ్యులు వ్యక్తం చేశారు. ఇలాంటి ఒక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయిన రామ్‌ చరణ్‌ను మరియు సుకుమార్‌ను అభినందించారు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రంగస్థలం చిత్రం కోసం సినీ వర్గాల వారు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సార్‌ బోర్డు రెస్సాన్స్‌ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.