ట్రైల‌ర్ విజ‌యం ఆయ‌న శ్ర‌మ‌కు ప్ర‌తిఫ‌లం…

ranveer singh response on Padmavati trailer
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ప‌ద్మావ‌తి చిత్రం ట్రైల‌ర్ కు అద్వితీయ‌మైన స్పంద‌న ల‌భించింది. ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రు ప‌ద్మావ‌తిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సినీ ప్ర‌ముఖులు ట్రైల‌ర్ ను ప్ర‌శంసిస్తూ వ‌రుస  ట్వీట్లు చేశారు.  ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ్ వీర్ సింగ్ జీవించాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. దీనిపై ర‌ణ్ వీర్ సింగ్ స్పందించారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతూ ట్విట్ట‌ర్ లో ఓ లేఖ‌ను పోస్ట్ చేశారు. ట్రైల‌ర్ బాగుంద‌ని ప్ర‌శంసించిన అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాల‌ని, ఇంత‌గా అభినంద‌న‌లు వెల్లువెత్త‌డం అరుదుగా జ‌రిగే విష‌య‌మ‌ని ర‌ణ్ వీర్ అన్నారు. ర‌క్తం, స్వేదం, క‌న్నీరు చిందించి క‌ష్ట‌ప‌డ్డ చిత్ర యూనిట్ కు ద‌క్కిన ఫ‌లితం ఇద‌ని, సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఈ సినిమా కోసం పోరాడార‌ని, బాధ‌లు భ‌రించార‌ని, త్యాగాలు చేశార‌ని, ట్రైల‌ర్ విజ‌యం ఆయ‌న శ్ర‌మ‌కు ప్ర‌తిఫ‌లం అని ఈ హీరో ఉద్వేగం చెందారు.
భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అదృష్టం ద‌క్క‌డం ఆశీర్వాదంగా భావిస్తున్నాన‌ని, ఆయన ద‌గ్గ‌ర కొత్త విష‌యాలు నేర్చుకుంటూ ప్ర‌తిరోజూ ఎదుగుతున్నాన‌ని తెలిపారు. ఇప్ప‌టికీ ప‌ద్మావ‌తి షూటింగ్ లోనే ఉన్నాన‌ని,  ట్రైల‌ర్ కు ద‌క్కిన ప్ర‌శంస‌లు చూస్తోంటే న‌మ్మ‌కం బ‌ల‌పడుతోంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు చూసింది సినిమాలో సూక్ష్మ భాగ‌మేన‌ని చెప్పారు. డిసెంబ‌రు 1 న థియేట‌ర్ల‌లో క‌లుద్దామ‌ని, అంద‌రికీ ఈ సినిమా మ‌ర్చిపోలేని అనుభూతిని మిగులుస్తుంద‌ని తెలిపారు. ప్రేమ‌తో ర‌ణ్ వీర్ అని త‌న లేఖ‌ను ముగించాడు.