రోజా లక్ష్మీపార్వతి అయితే ?

YSRCP MLA Actress Roja will be the laxmi Parvathi role in RGV Laxmi's NTR Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేసిన ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” లో లక్ష్మీపార్వతి పాత్ర ఎవరు పోషిస్తారో అని ఇప్పటికే హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో రోజా కి స్థానం ఉంటుందని చెప్పి రాము ఆ మంటల్లో ఇంకాస్త నెయ్యి చల్లాడు. దీంతో లక్ష్మీపార్వతి పాత్రలో రోజా చేయడం దాదాపు ఖాయమని అనుకుంటున్నారు. రాము చెప్పింది చేస్తాడో లేదో ఆయనకే తెలియదు. కానీ జనం అనుకున్నట్టు లక్ష్మీపార్వతి పాత్రలో రోజా నటిస్తే మాత్రం ఈ సినిమా అసలు లక్ష్యం నెరవేరదు . సినిమాకి లక్ష్యం ఏంటి ? హిట్ కొట్టి డబ్బులు సంపాదించడం కాక అనుకుంటున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక జరిగిన పరిణామాలు చూపించడం చిత్ర యూనిట్ ఉద్దేశం కాదు …ఆ పరిణామాల్ని లక్ష్మీపార్వతి కోణంలో చూపించడం రాము ఉద్దేశం అయి ఉంటుంది. అందుకే సినిమాకి “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” పేరు పెట్టారు. అందుకే వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా ముందుకు వచ్చారు.

” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమాలో సీఎం చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే అంశాలు కచ్చితంగా ఉంటాయి. ఇక ఎన్టీఆర్ కుటుంబం గురించి ఎలా చూపిస్తారు అన్నది ఇప్పుడే అంచనా వేయలేము. ఇదంతా ఒక ఎత్తు అయితే లక్ష్మీపార్వతి పాత్రలో రోజా నటిస్తే మాత్రం జనం సినిమాలో ఒక్క లక్ష్మీపార్వతిని మాత్రమే చూడరు. అంతకు మించి రోజా స్టేట్ మెంట్స్, ఆమె వైసీపీ నాయకురాలు, నోటి దురుసు ఎక్కువ లాంటి విషయాలు మొత్తం పేక్షకుడి మదిలోకి వస్తాయి. పైగా వర్మ ఈ సినిమా గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కారాలు మిరియాలు నూరుతున్న టీడీపీ వర్గాలకి రోజా వ్యవహారం కూడా ఓ అస్త్రం అవుతుంది. మొత్తానికి మొత్తంగా వైసీపీ నాయకుడు రాకేష్ రెడ్డి నిర్మాత, వైసీపీ నాయకురాలు రోజా ప్రధాన పాత్ర, ఇక సినిమా తీస్తోంది వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి గురించి …ఈ విషయాలు ముందుకు రావడంతో ఇది చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి, వైసీపీ కి మేలు చేయడానికి ఆ పార్టీ వెనక ఉండి చేస్తున్న సినిమాగా ముద్రపడుతుంది. ఇలాగే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ ని టార్గెట్ ఒకటి రెండు కాదు తామరతంపరగా సినిమాలు తీశారు. కానీ వాటి వల్ల కృష్ణ డబ్బులు, మంచి పేరు పోవడం తప్ప ఎన్టీఆర్ కి వీసమెత్తు నష్టం కూడా జరగలేదు. ఈ పరిణామాలు అన్ని దృష్టిలో పెట్టుకుని రోజా ని ఈ సినిమాకి దూరం పెడితేనే కొంతలో కొంత నయం.