ఫ్రెండ్స్ తో కలిసి లవర్ మీదే రేప్ !

rape on lover with friends

రోజురోజుకీ అభివృద్ధి చెందాల్సిన మనుషులు కీచక పర్వాలతో జీవితాలను నాశనం చేయడమే కాక తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ యువతిపై తన ముగ్గురి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె ప్రియుడు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని, పరామర్శకు వెళ్దామని చెప్పి బాధితురాలిని ప్రియుడు పృథ్వి తన ద్విచక్రవాహనంపై ఒక చోటకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె మీద అత్యాచారం చేశాడు. మద్యం సేవించి తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు చెబుతోంది.  అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని బొబ్బిలి పృథ్వి, దలాయి శ్యామ్‌కుమార్, వి.సాయి, ఎన్‌.సాయికుమార్‌‌గా పేర్కొన్నారు.