కామాంధుడు: ఐసోలేషన్ లోనే అత్యాచారం…. ఆపై మహిళ మృతి…

కరోనా వైరస్ ప్రచంచాన్ని వణికించేస్తుంటే… సొసైటీలో మనిషి కోరికలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. లాక్ డౌన్ సమయంలో కూడా మహిళలపై అత్యాచారాలు అస్సలు తగ్గడం లేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతున్న మహిళలపై వైద్యులే అఘాయిత్యాలకు పాల్పడిన ఘటన బీహార్ లో తాజాగా చోటుచేసుకుంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న మహిళ ఐసోలేషన్ వార్డులో ఉండటంతో ఆ మహిళపై రెండు రోజులుగా లైంగికంగా కోరికలు తీర్చుకున్నాడు వైద్యుడు. దీంతో ఆ మహిళ శక్తిని కోల్పోయి.. రక్తస్రావమై ప్రాణాలు విడిచింది.

అయితే ఇప్పుడు ఈ వార్త అంతటా వైరల్ గామారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని గయ ప్రాంతంలో కరోనా వైరస్ బాధితులకోసం అనుగ్రహ నరైన్ మగద్ మెడికల్ కాలేజీలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఓ మహిళకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 25 ఏళ్ల బాధితురాలు బీహార్లోని గయా జిల్లా నుంచి వచ్చింది. ఆమె రెండు నెలల గర్భవతి కూడా. ప్రయాణం కారణంగా అబార్షన్ కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆ మహిళ ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

కాగా మార్చి 27వ తేదీన మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్న ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఐసొలేషన్ వార్డులో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు వైద్యులకు.. ఆమెపై కన్ను పడింది. దీంతో వాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈనెల 2, 3 తేదీల్లో ఆమెపై వైద్యులు అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత కరోనా వైరస్ టెస్ట్ లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జి చేసి బాధితురాల్ని ఇంటికి పంపారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన ఘోరాన్ని బాధిత మహిళ తన అత్తకు చెప్పింది. ఆ తర్వాత అధిక రక్తస్రావం కావటంతో ఆమె ప్రాణం విడిచింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.