కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం మీద హైకోర్టులో కేస్…!

Rapolu Ananda Bhaskar Petition In Highcourt

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రముఖ న్యాయ వాడి రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఇంకా 9 నెలలు కొనసాగాల్సి ఉండగా ముందే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు అధికారాన్ని యిచ్చారని, కానీ 9 నెలల కాలం ఉండగానే ముఖ్యమంత్రి సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

kcr-anandh-bhasker
అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భాస్కర్ ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో భాస్కర్ కోరారు. పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

anadh-bhasker-congress