ముంబైలో చేజింగ్‌ చేస్తున్న రాశీఖన్నా

ముంబైలో చేజింగ్‌ చేస్తున్న రాశీఖన్నా

హీరోయిన్‌ రాశీఖన్నా ముంబైలో చేజింగ్‌ చేస్తున్నారు. అయితే ఈ చేజింగ్‌ ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం కాస్త సమయం పడుతుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా, దిశాపటానీ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘యోధ’. సాగర్, పుష్కర్‌ ద్వయం తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీ ఖన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రాశి ఎవర్నో చేజ్‌ చేసే సన్నివేశాల షూటింగ్‌ జరుగుతోందట. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబరులో విడుదల కానుంది. కాగా హిందీలో ‘రుద్ర’, సన్నీ వెబ్‌ సిరీస్‌లను కూడా పూర్తి చేశారు రాశీఖన్నా. సౌత్‌లో ఆమె నటించిన ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్‌’, సర్దార్‌’ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.