చిన్న విషయాన్ని రచ్చ చేస్తున్నారు…!

Rashmika Mandanna Says I Don't Like My Acting

‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌డంను దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్న కారణంగా వివాహ నిశ్చితార్థంను రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. కన్నడ నటుడు రక్షిత్‌తో ఈ అమ్మడు వివాహం జరగాల్సి ఉన్నా కూడా క్యాన్సల్‌ చేసుకోవడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఈమె రక్షిత్‌ మూవీ నుండి కూడా తప్పుకోవడంతో వివాదం మరింతగా ముదురుతోంది. కన్నడ ప్రేక్షకులు మరియు సినీ జనాలు రష్మికపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు రష్మిక సోషల్‌ మీడియా ద్వారా వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.

rashimika

స్వయంగా రక్షిత్‌ కూడా రష్మికను వదిలేయండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులను కోరడం జరిగింది. కాని సోషల్‌ మీడియాలో రష్మికపై కామెంట్స్‌ తగ్గడం లేదు. తన తప్పు లేకున్నా తనను పదే పదే ఎందుకు ఇంతగా విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇద్దరం మాట్లాడుకుని, ఒప్పందంతో వివాహ నిశ్చితార్థంను క్యాన్సిల్‌ చేసుకోవడం జరిగింది. కాని సోషల్‌ మీడియాలో మాత్రం మరీ దారుణంగా విమర్శలు వస్తున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌లో తాను ప్రస్తుతం బిజీగా ఉన్న కారణంగా కన్నడ సినిమాను క్యాన్సిల్‌ చేసుకోవడం జరిగింది. అంత మాత్రాన తాను కన్నడ సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లుగా కాదు అని, చిన్న విషయంను బూతద్దంలో పెట్టి చూసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

geetha-govindham-heroin