హిందీలో హీరోయిన్ రష్మికా మందన్నా క్రేజ్ మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’లో హీరోయిన్‌గా నటించారామె. బాలీవుడ్‌కు రష్మిక పరిచయం కానున్న తొలి చిత్రం ఇది. వేసవిలో విడుదల కానుంది. అలాగే అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ‘డాడీ’ చిత్రంలో రష్మిక మరో లీడ్ క్యారెక్టర్ చేశారు. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
అయితే ఈ రెండు చిత్రాల తర్వాత మూడో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నారు. హీరో వరుణ్ ధావన్‌తో షూట్‌లో ఉన్నారు రష్మిక. ‘‘ఫ్రమ్ వర్కౌట్స్ టు షూటింగ్.. హ్యాపీ ఫేసెస్’ అంటూ ఆనందంగా వరుణ్‌తో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేశారు రష్మిక. దీంతో వరుణ్‌తో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం స్పష్టమైంది. అయితే ఈ ఇద్దరూ నటిస్తున్నది యాడ్ కోసమా? సినిమానా? లేక వెబ్ సిరీస్‌నా? అనే విషయం తెలియాల్సి ఉంది.