రష్మిక మందన ప్రస్తుతం జోరు మీదుంది. వరుసగా సినిమాలను పట్టాలెక్కించేస్తోంది. ఇక ఆల్రెడీ పుష్పతో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ క్రియేట్ చేసింది. అసలే నేషనల్ క్రష్ అయిన రష్మిక.. ఇప్పుడు పుష్ప సినిమాతో అందరికీ ఫేవరేట్ హీరోయిన్‌గా మారింది. బాలీవుడ్ సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే అక్కడ రష్మికకు మంచి పాపులారిటీ వచ్చేసింది. రష్మికకు నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే రష్మిక ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టేసింది.
ఇప్పుడు రష్మిక చేతిలో రెండు మూడు బాలీవుడ్ సినిమాలున్నాయి. ఇక తెలుగులో అయితే పుష్ప 2, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే రెండు సినిమాలున్నాయి. ఇప్పుడు ఇందులో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఫిబ్రవరి 25న రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక తన వంతు పాత్రను తాను పోషించేస్తోంది.
వాలెంటైన్స్ డే స్పెషల్ అంటూ స్పెషల్ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను మరింతగా ప్రమోట్ చేసేందుకు రెడీ అయింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.