రెండు సినిమాలతో నితిన్‌ రెడీ…!

Rashmika Mandanna To Be Paired Opposite Nithiin In Venky Kudumula Film

వరుసగా రెండు చిత్రాలతో పరాజయాలను చవి చూసిన దర్శకుడు నితిన్‌ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

chandra shaker

గత మూడు నాలుగు నెలలుగా ఈ చిత్రంకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని, వచ్చే నెల నుండి చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించబోతున్న విషయం తెల్సిందే.

nithin-rashimika-mandana

‘భీష్మ’ చిత్రంతో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందట. భారీ ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాలతో నితిన్‌ మళ్లీ ఫాంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

nithin-chandrashaker-yelati

విభిన్న చిత్రాలను తెరకెక్కించి, తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చంద్రశేఖర్‌ యేలేటి ప్రస్తుతం ఒక మంచి స్క్రిప్ట్‌ను నితిన్‌ కోసం సిద్దం చేస్తున్నాడు. నితిన్‌ స్క్రిప్ట్‌ విషయంలో ఇప్పటికే ఫైనల్‌ గా ఓకే చెప్పేశాడట. ఆ చిత్రం త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రాలు వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని నితిన్‌ భావిస్తున్నాడు.

rashimika-mandana