మళ్లీ పవన్‌ దర్శకుడితో..!

nithin next movie with Director Dolly

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నితిన్‌కు పవన్‌ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో పలువురు యువ హీరోలు పవన్‌ను అభిమానిస్తారు. అయితే అందరి కంటే ఎక్కువ పవన్‌కు నితిన్‌ అభిమాని అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో పలు సందర్బాల్లో నితిన్‌ తనకు పవన్‌పై ఉన్న అభిమానంను కనబర్చాడు. తాజాగా మరోసారి పవన్‌పై ఉన్న అభిమానంతో ఆయనతో సినిమా చేసిన దర్శకుడు డాలీతో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గతంలో పవన్‌తో సినిమా చేసిన కరుణాకరన్‌ దర్శకత్వంలో నితిన్‌ ఒక సినిమాను చేశాడు. ఆ సినిమా అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు పవన్‌కు కాటమరాయుడు వంటి ఫ్లాప్‌ను ఇచ్చిన డాలీ దర్శకత్వంలో ఒక సినిమాను నితిన్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.

నితిన్‌ హీరోగా ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరో వైపు నితిన్‌ కొత్త సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. నితిన్‌ హీరోగా డాలీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత డాలీ దర్శకత్వంలో మరే సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నితిన్‌ ఆయన దర్శకత్వంలో చేసేందుకు ముందుకు వచ్చాడు. ఒక మంచి స్టోరీతో వీరిద్దరి కాంబో మూవీ రాబోతున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. నితిన్‌ సొంత బ్యానర్‌లోనే ఈ చిత్రం తెరకెక్కబోతుంది. తన అభిమాన హీరోకు ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడు డాలీతో నితిన్‌ సినిమా చేయడం కాస్త విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.