జగన్ ని మించిపోతున్న పవన్ !

Pawan Kalyan response on CM in Janasena Porata Yatra in AP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అనే విధంగా ఇప్పుడు ప్రజాయాత్రలలోకి దిగిన పవన్ జగన్ నే మించిపోతున్నాడు సీఎం నామస్మరణలో. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రజల వద్దకు వెళ్లగానే అక్కడివారంతా పెద్ద ఎత్తున సీఎం… సీఎం… సీఎం… పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… ” నేను మీరంటున్నట్లుగా సీఎం కావాలంటే మీరు ఒకటి చేయాలి. అదేమిటంటే… ముందు మీమీ తల్లిదండ్రులతో నాకు ఓట్ వేయించాలి అంటూ పేర్కొన్నారు. దీంతో మీ పర్యటనలకి వచ్చేవారు అంతా ఓట్ హక్కు కూడా లేని వారేనా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇదే విధంగా పవన్ తాను సీఎం అవడమే లక్ష్యం అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్ కూడా ఇలాగే సీఎం నామస్మరణ చేసేవారు. అయితే కాలక్రమేనా అది కాస్త తగ్గినా ఇప్పుడు ఆ పల్లవిని పవన్ అందుకున్నట్టు అనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు అసలు ఆ సీఎం అనే పదం ఊసే ఎత్తని పవన్ కళ్యాణ్ ఆ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుండి తన స్టాండ్ పూర్తిగా మార్చేసుకున్నట్టు సాధారణ కార్యకర్తలకు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక కులం బలంతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ పదే పదే తనకు కులం మతం లేదంటూ తనపై కుల ముద్ర చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. (అయితే తన పార్టీలో నియమించిన నాయకులు, ప్రతినిధులు అదరు తన కులం వారే అవడం కొసమెరుపు)

కర్ణాటకలో జేడీఎస్ లాగే తాను కూడా ఒక ప్రాంతాన్ని (ఒక కులాన్ని) నమ్ముకున్న పవన్ వాటిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారిపుడు. అదే విధంగా కన్నడ ఎన్నికల ఫలితాల మొదలు పవన్ సీఎం పల్లవి ఎత్తుకోడానికి కారణం కూడా నిన్న పవనే స్వయంగా ప్రకటించారు. అదేంటంటే… ఏపీలో సీఎం కావాలంటే మెజారిటీ రావక్కర్లేదని కేవలం 30 సీట్లు గెలిస్తే చాలని పవన్ అనుకుంటున్నారట. తన అభిమానులు – కార్యకర్తలు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటరుతో జనసేనకు ఓటు వేయిస్తే తాను సీఎం అవుతానని* చెప్పారు. ఆయన నోటి నుంచి ఈ మాట వింటే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ఎంత సీఎం కావాలని ఉంటే మాత్రం మరీ ఇంత డైరెక్టుగా చెప్పాలా ? చంద్రబాబు సైతం వచ్చే సారి అధికారంలోకి వచ్చేది మన పార్టీ నే అంటారు కానీ ఇలా మరీ డైరెక్టుగా అందరూ వెళ్లి తనకు ఓటు వేసి సీఎం చేయమని అడగడం పవన్ కే చెల్లింది. ఒకప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారం అక్కర్లేదని, అలాగే జనసేన పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే అన్న ఆయన పవన్ కళ్యాణ్ ఈరోజు తన సీఎం కావాలని ఇంత బహిరంగంగా చెప్పడం విడ్డూరమే మరి.