రవితేజకు జోడీగా రష్మిక.. మరో పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్ !

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి మనకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె టాలీవుడ్ సినిమాలతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో పాగా వేయడానికి పయనమయింది అని మనం చెప్పవచ్చు. అందులో భాగంగానే ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని పొందింది.

రవితేజకు జోడీగా రష్మిక.. మరో పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్ !
Ravi teja, Rashmika

ఇది ఇలా ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్వరలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మికను తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే చర్చలు కూడా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రష్మిక పేరు తెరపైకి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.