‘భీష్మ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో సందడి చేస్తున్నరష్మిక

'భీష్మ' ప్రమోషన్ కార్యక్రమాల్లో సందడి చేస్తున్నరష్మిక మందన్న

ఛలో చిత్రంతో టాలీవుడ్ తెరపై కనువిందు చేసిన రష్మిక మండన్న, అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న భీష్మ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో సందడి చేస్తుంది. ఇప్పటికే విడుదల అయినటువంటి ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోలకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక ఒక ఆసక్తికర విషయాన్నీ మీడియా తో తెలియజేసింది.

మీకు ఎవరిపైన క్రష్ ఉందని, ఫ్యూచర్ లో ఎవరితో నటించాలని అనుకుంటున్నారని విలేకరి ప్రశ్నించగా, రష్మిక మందన్న ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తనకి చిన్ననాటి నుండే తమిళ నటుడైన ఇళయ దళపతి విజయ్ ఫై క్రష్ ఉండేదని అన్నారు, అంతేకాకుండా అతనితో ఫ్యూచర్ లో నటించాలని ఉంది అని తెలియజేసారు. అయితే విజయ్ ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ చిత్రానికి మొదటగా రష్మిక హీరోయిన్ గా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన తాను నటించలేదు. అయితే రష్మిక టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, తమిళనాట సైతం నటించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి తన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. రష్మిక మండన్న నితిన్ చిత్రం అనంతరం సుకుమార్ దర్శకత్వం లో అళ్లుయ్ అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.