కొత్త కథలు కావాలని హీరోలే ఎప్పుడూ రైటర్స్ కి పిలుపు ఇవ్వరు. నిర్మాతలుగా మారే ఆలోచన ఉన్నాకానీ తమ దగ్గరకు వచ్చిన కథల్లోంచే పిక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది రష్మిక ఒక ఆసక్తికరమయిన ప్రకటన ఇచ్చింది.
తాను కొత్త తరహా కథల కోసం చూస్తున్నానని, ఎవరి దగ్గరయినా మంచి కథలు ఉంటే అవి తనకి మెయిల్ చేయమని ఒక ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. తన దగ్గర చాలా చిన్న టీం ఉందని, అంచేత కథలు చదివి రెస్పాండ్ అవడానికి సమయం పడుతుందని, అంతవరకు సంయమనంతో ఉండాలని కోరింది. అసలు రష్మిక లాంటి బిజీ హీరోయిన్ కి కథల కోసం వేటకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?
హీరోయిన్ ఓరియెంటెడ్ కథలు రావడం లేదని ఇలా ట్రై చేస్తోందా లేక నిర్మాతగా మారి చిన్న సినిమాలు తీసే ఆలోచనలో ఉందా? స్టేజి మీద, ఇంటర్వ్యూ లలో మరీ తింగరిమేళంలా ప్రవర్తించినా కానీ రష్మిక బుర్రలో చాలానే ఐడియాలు ఉన్నాయి.