క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ట్రిప్ కి వెళ్లిన రష్మిక, విజయ్

Rashmika, Vijay go on a trip for Christmas and New Year celebrations
Rashmika, Vijay go on a trip for Christmas and New Year celebrations

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి . ఈ వార్తలపై వారు స్పందిస్తూ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి . తాజాగా, ఈ వార్తలని బలపరిచే మరో ఘటన జరిగింది .

Rashmika, Vijay go on a trip for Christmas and New Year celebrations
Rashmika, Vijay go on a trip for Christmas and New Year celebrations

సోమవారం వారిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిశారు. రష్మిక ముందు ముంబైలో ల్యాండయ్యారు. అక్కడ ఫొటోగ్రాఫర్లకి పోజులిచ్చారు. అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ముంబైలో వాలిపోయారు. దీంతో ఇద్దరూ కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది . ఇటీవల ఈ జంట రెస్టారెంట్‌లో కలిసి కనిపించిన ఫొటో ఒకటి వైరల్ అయింది.