రధం….బోల్డ్ లవ్ ట్రైలర్ !

Ratham Movie Trailer

తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ కారణంగానే విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తూ ఉంటాయి. అందులోనూ ఈ మద్య బోల్డ్ లవ్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘రథం’ పేరుతో మరో ప్రేమకథా చిత్రం రూపొందింది. గీతానంద్, చాందిని హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడం, వారి ప్రేమ శ్రుతిమించి పెద్దలు వారిని విడదీయడం, వాళ్లు పెద్దలను ఎదిరించడం నేపథ్యంలో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి మరి.