పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ చుట్టూ అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘శ్రీరామదాసు’ సినిమాలో శ్రీరాముడిగా నటించిన సీనియర్ హీరో సుమన్ కూడా ఈ సినిమాను గురించి మాట్లాడారు.
‘ఆదిపురుష్’ సినిమా చూశాను. బడ్జెట్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. ‘రామాయణం’ కథను మొత్తం చూపిస్తారనుకుని వచ్చిన ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యారు. కారణం సీతాదేవిని రావణుడు తీసుకెళ్లడం, శ్రీరాముడు ఆమెను తిరిగి తీసుకురావడం మాత్రమే ఈ సినిమాలో చూపించారు. ఇక ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి శ్రీరాముడిగా నీలం రంగులోనే కనిపిస్తూ వచ్చారు. కానీ ఈ సినిమాలో చాలా నార్మల్ గ చూపించారు” అని సుమన్ అన్నారు.
రాముడిగా ప్రభాస్ చాలా బాగున్నాడు .. కానీ మీసాలు పెట్టారు. ఇంతవరకూ ఎక్కడా అలా చేయలేదు. శ్రీరాముడు మహా శాంతమూర్తి .. అలాంటి ఆయనతో ఫోర్స్ గా ఉండే బారి డైలాగ్స్ కోపం తో చెప్పించారు. ఇక రావణుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టారు. ఆయన పాత్రపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. సాంగ్స్.. రీ రికార్డింగ్ నాకు బాగా నచ్చాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కుదరలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

