రావి కొండల రావు కన్ను మూత

రావి కొండల రావు కన్ను మూత

ప్రముఖ సినీ నటుడు, రచయితే రావి కొండల రావు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు.

1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావు సినీ రచయితగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నేడు రావి కొండలరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.