ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ స్పెక్ట్రం వేలాన్ని 5జీ టెలికం సేవలు అందించడానికి ఈ సంవత్సరంలోనే నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధర ఇంకా తగినంత స్పెక్ట్రం ఉంటే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు ఆసక్తి చూపుతాయని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. గత ఏడాది టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ కూడా 5జీ స్పెక్ట్రం వేలానికి 4.9లక్షల కోట్ల బేస్ధరను నిర్ణయించ వలసి వస్తుందని తెలిపింది.
దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్ 14 నుండి 16 వరకి జరుగనుంది.110 మంది విదేశీ కొనుగోలుదారులు, 250స్టార్టప్‌లు పాల్గొన్నాయి.
టెలికం దిగ్గజాలు కొత్త కాన్సెప్ట్స్‌ను ప్రదర్శించాయి.ఎరిక్సన్,ఎయిర్టెల్ ఒకేసారి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్‌లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించాయి.వొడాఫోన్ ఐడియా స్మార్ట్ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని ప్రదర్శన ఇవ్వగా రిలయన్స్ జియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది.