నేల టికెట్‌ సక్సెస్‌ అయితే..!

Ravi Teja and Kalyan Krishna hopes on Nela Ticket movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాతో దర్శకుడిగా ప్రేక్షకుల అభిమానంను, ఆధరణను దక్కించుకున్న కళ్యాణ్‌ కృష్ణ తాజాగా రవితేజ హీరోగా ‘నేలటికెట్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. రవితేజలోని మాస్‌ యాంగిల్‌ను కొత్తగా చూపించబోతున్నట్లుగా మొదటి నుండి దర్శకుడు చెబుతూ వస్తున్నాడు. అన్నట్లుగానే కొత్త మాస్‌ మహారాజ్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నట్లుగా ట్రైలర్ మరియు టీజర్‌లు చూస్తుంటే అర్థం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘నేలటికెట్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారంలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తర్వాత నాగార్జునతో ఈ దర్శకుడు ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది.

నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలోని బంగార్రాజు పాత్రను లీడ్‌ రోల్‌గా తీసుకుని ఒక సినిమాను తెరకెక్కించాలని భావించారు. అందుకోసం కొన్ని స్టోరీ లైన్స్‌ను కూడా దర్శకుడు సిద్దం చేయడం జరిగింది. వాటిల్లోంచి ఒక లైన్‌ను ఎంపిక చేసి సినిమా చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడు. అయితే ‘నేలటికెట్‌’ సినిమా సక్సెస్‌ అయితేనే అంటూ నాగార్జున చిన్న కండీషన్‌ను కళ్యాణ్‌ కృష్ణకు పెట్టినట్లుగా తెలుస్తోంది. రవితేజతో పాటు కళ్యాణ్‌ కృష్ణకు కూడా ఇప్పుడు నే టికెట్‌ సక్సెస్‌ చాలా కీలకం. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు పాటలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా ఉంది. దాంతో తప్పకుండా సినిమా సక్సెస్‌ అవుతుందని, అంతా ఎదురు చూస్తున్న బంగార్రాజు సినిమాను కళ్యాణ్‌ కృష్ణ మొదలు పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.