నాని సినిమాలో గెస్ట్‌లుగా స్టార్స్‌

Ravi Teja, Kajal and Nithya Menon as Guests roles in nani AA film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ హీరోలు నిర్మాతలుగా మారడం ఇటీవల సర్వ సాధారణం అయ్యింది. టాలీవుడ్‌లో స్టార్స్‌గా వెలుగు వెలుగుతున్న పలువురు హీరోల మాదిరిగానే నాని కూడా ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. వాల్‌పోస్టర్స్‌ బ్యానర్‌పై ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా రివీల్‌ చేయలేదు. కాని సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో మాత్రం నాని నిర్మిస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ సినిమాకు ‘అ!’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన నాని తనకున్న పరిచయాలతో సినిమా స్థాయిని పెంచే పని చేస్తున్నాడు.

nani

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘అ!’ చిత్రంలో ముఖ్య పాత్రల్లో గెస్ట్‌లుగా రవితేజ, కాజల్‌, నిత్యామీనన్‌ ఇంకా ఇద్దరు టాలీవుడ్‌ స్టార్స్‌ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒక వైపు హీరోగా వరుసగా విజయాలు దక్కించుకుంటున్న నాని నిర్మాతగా మారి చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో అని సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే వేసవిలో నాని సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది. ఇక నాని హీరోగా నటించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కాకుండా మరో చిత్రం ‘కృష్ణార్జున యుద్దం’లో కూడా నాని నటిస్తున్నాడు. మరో రెండు సినిమాలు కూడా సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి