అర్జున్‌ రెడ్డి అలా మొదలు పెట్టబోతున్నాడా?

vijay devarakonda next movie with director nandini reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘అలా మొదలైంది’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి ఆ తర్వాత తెరకెక్కించిన రెండు చిత్రాలు కూడా డిజాస్టర్‌లు అయ్యాయి. దాంతో నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఏ ఒక్క హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు. ఆ మద్య వెంకటేష్‌కు నందిని రెడ్డి కథ చెప్పింది. వెంకీ మొదట ఓకే అన్నట్లుగా అనిపించినా, ఆ తర్వాత కొంత కాలం అయిన తర్వాత సినిమా చేద్దామని, ఈలోపు మరేదైనా సినిమా చూసుకో అంటూ సలహా ఇచ్చాడట. దాంతో నిరాశగా నందినిరెడ్డి మళ్లీ అన్వేషణ ప్రారంభించింది. ఎట్టకేలకు నందిని రెడ్డిని నమ్మి ఒక హీరో ఛాన్స్‌ ఇచ్చేందుకు ఓకే చెప్పాడు.

vijay-devarakonda

నందిని రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ నటించేందుకు ఓకే చెప్పాడు. ఇటీవలే విజయ్‌కు కథను చెప్పిన నందిని రెడ్డి ఓకే చెప్పించుకుంది. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి మూడు సినిమాలను కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాలు వచ్చే సంవత్సరం ద్వితీయార్థం వరకు కొనసాగే అవకాశం ఉంది. అందుకే నందిని రెడ్డితో సినిమాను వచ్చే ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశం ఉంది. నందిని రెడ్డికి వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా కూడా ఆమెపై ఉన్న నమ్మకం మరియు గౌరవంతో ఈ చిత్రాన్ని చేసేందుకు విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. నందిని రెడ్డి గతంలో పలువురు దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా చేసింది. ఇక పలు సినిమాలకు స్క్రిప్ట్‌ రచనలో హెల్ప్‌గా నిలిచింది. రచయితగా నందిని రెడ్డికి మంచి పేరు ఉంది.