‘నేలటిక్కెట్టు’కు విచిత్రమైన పరిస్థితి…

Ravi Teja Nela Ticket movie Public Response

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్‌గా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేలటిక్కెట్టు’. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ గత చిత్రాలు ‘సోగ్గాడే చిన్ని నాయన’ మరియు ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ కారణంగానే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు కలిగి ఉన్నారు. అందుకే ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ చేసింది. ముఖ్యంగా శాటిలైట్‌ రైట్స్‌ మరియు డబ్బింగ్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. నిర్మాతకు టేబుల్‌ ప్రాఫిట్‌ను ఈ చిత్రం తెచ్చి పెట్టింది.

రవితేజ గత చిత్రం ‘టచ్‌ చేసి చూడు’ బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో పాటు రవితేజ గత రెండు మూడు సంవత్సరాలుగా చేసిన సినిమాలు, సాధించిన విజయాలను బేరీజు వేసుకుని ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. రవితేజ పనైపోయిందని, ఆయన సినిమాలు ఇంకా ఏం చూస్తాం అన్నట్లుగా ప్రేక్షకులు ఒక రకమైన అభిప్రాయంకు వచ్చేశారు. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ సినిమా గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు. సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌లు కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచడంలో విఫలం అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందని సినీ వర్గాల వారు భావిస్తుంటే, ప్రేక్షకులు మాత్రం అంత సీన్‌ లేదేమో అనే అభిప్రాయంలో ఉన్నారు.నేలటిక్కెట్టుకు నెలకొన్న విచిత్రమైన పరిస్థితిపై ఈనెల 25 చిత్రం విడుదలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.