రవితేజ, శ్రుతీహాసన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. గతంలో రవితేజతో ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు.
బుధవారం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఉద్వేగభరితమైన కథా కథనాలతో ‘క్రాక్’ సినిమా రూపొందుతోందని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం పేర్కొంది.