Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన తరువాత ఆ దేశంలో జాతి వివక్ష అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్య దేశం అని గొప్పలు చెప్పుకునే అమెరికాలో భిన్నాభిప్రాయాలకు సరైన గౌరవం దక్కటం లేదు. తమ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వస్తున్న అభిప్రాయాలను హుందాగా స్వీకరించకుండా… జాతి విద్వేషం ప్రదర్శిస్తున్నారు కొందరు ట్రంప్ మద్దతుదారులు. చార్లెసట్ విల్లే ఘటనపై ట్రంప్ వైఖరిని వ్యతిరేకించినందుకు భారత సంతతి వ్యాపారవేత్త రవీన్ గాంధీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది.
జీఎంఎం నాన్ స్టిక్ కోటింగ్స్ సంస్థకు సీఈవో అయిన రవీన్ గాంధీ ఇటీవల ఓ పత్రికకు రాసిన ఆర్టికల్ లో ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. చార్లెట్స్ విల్లే ఘటన తరువాత ట్రంప్ కు మద్దతు ఇవ్వటం లేదని, ఆయన ఆర్థిక ఎజెండా స్పష్టంగా లేదని రవీన్ గాంధీ విమర్శించారు. తన రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలను ట్రంప్ చూసీ చూడనట్లు వ్యవహరించటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహించిన ట్రంప్ మద్దతుదారులు రవీన్ గాంధీని బెదిరిస్తూ ఈ మెయిల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా వాయిస్ మెయిల్స్, ట్వీట్లు, ఫోన్ కాల్స్ లోనూ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు.
ఓ మహిళ వాయిస్ మెయిల్ ద్వారా చేసిన అనుచిత వ్యాఖ్యలను రవీన్ గాంధీ యూ ట్యూబ్ లో షేర్ చేశారు. ఆ వాయిస్ మెయిల్ లో యువతి రవీన్ గాంధీని పంది అని సంబోధించింది. పరదేశీ… భారత్ కు తిరిగి వెళ్లిపో అని బెదిరించింది. రవీన్ తో పాటు భారత సంతతికి చెందిన ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హేలీని కూడా ఆమె ఈ వాయిస్ మెయిల్ లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించింది. త్వరలోనే బౌద్ధ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ట్రంప్ మద్దతుదారులు ఇలా బెదిరింపులకు పాల్పడుతుండటంపై అమెరికాలోని భారతీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికాలో భారతీయులకు తమ భద్రతపై రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రవీన్ గాంధీకి వచ్చిన బెదిరింపులు భారతీయులను మరింత అభద్రతా భావంలో పడేస్తున్నాయి. .
A woman told this CEO to ‘go back to India’ after he spoke out against Donald Trump pic.twitter.com/fUQOXfhxpx
— NowThis (@nowthisnews) August 23, 2017
మరిన్ని వార్తలు: