అదే నిజం అయితే సూపర్‌, కాని..!

raviteja as villain role in rajamouli multistarrer
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత చేయబోతున్న సినిమాపై దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రాజమౌళి సినిమాలను తీసుకుంటే హీరో స్థాయిలో విలన్‌ పాత్ర ఉంటుంది. కొన్ని సినిమాల్లో హీరో కంటే విలన్‌ బలవంతుడిగా కూడా కనిపించాడు. అందుకే త్వరలో జక్కన్న చేయబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో విలన్‌ ఎవరై ఉంటారు అంటూ గత కొన్నాళ్లుగా చర్చ జరగుతుంది. ఒక టాలీవుడ్‌ స్టార్‌ హీరోను జక్కన్న తన మల్టీస్టారర్‌ చిత్రంలో నటింపజేయబోతున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి.

తాజాగా రవితేజ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. రాజమౌళి తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో విలన్‌గా అవకాశం వస్తే చేస్తారా అంటూ సోషల్‌ మీడియాలో ఒక అభిమాని ప్రశ్నించడం జరిగింది. అందుకు సమాధానంగా ఛాన్స్‌ వస్తే తప్పకుండా అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ అభిమాని అడిగిన ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మూవీలో రవితేజ విలన్‌ అయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని, ఆ మల్టీస్టారర్‌ సినిమా సూపర్‌ అంటూ ప్రేక్షకులు కూడా చర్చించుకుంటున్నారు. కాని అది సాధ్యం అయ్యే పని కాదని, జక్కన్న విలన్‌గా యంగ్‌ హీరోను ఎంపిక చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రవితేజ విలన్‌ అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. రవితేజ కంటే స్టార్‌ను విలన్‌గా నటింపజేస్తాడా లేదా అనేది త్వరలో తేలిపోయే అవకాశం ఉంది.