Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Raviteja Press Meet About His Brother Death
తమ్ముడు భరత్ మరణం తర్వాత తనపై వచ్చిన విమర్శలకు హీరో రవితేజ ఎట్టకేలకు సమాధానం ఇచ్చారు. సాక్షికి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ లో రవితేజ ఎవరినీ తప్పుబట్టలేదు. కేవలం తామున్న పరిస్థితి మీద మాత్రమే వివరణ ఇచ్చారు. అయితే కాస్త మనసు తడి వున్నవారు ఎవరికైనా అవి సమాధానాలు కాదు. ప్రశ్నలు. ఎదుటి మనిషి కష్టం చూసి రాళ్లు వేసే, నవ్వుకునే వారికి చెంప చెళ్లుమని తగిలే దెబ్బలు.
ఓ మనిషి చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎంత బాధలో ఉంటుందో తెలుసు. అయినా కూడా ఏ సమాచారం తెలియకుండా కేవలం సంచలనం కోసం డబ్బులు ఇచ్చి జూనియర్ ఆర్టిస్ట్ తో దహన సంస్కారాలు చేశారని రాసిన వారి సంస్కారాన్ని ఏమనగలం? ఇక శవం దగ్గరికి వెళ్లాలంటే భయపడే వాళ్ళు మనకి నిత్య జీవితంలో చాలా మంది తారసపడతారు. అలాంటి వారిలో రవితేజ ఒక్కరు. ఆ విషయం తెలియకుండా ఏదేదో రాసినవాళ్ళని ఒక్క మాట అనకుండానే రవితేజ తన సంయమనంతో చెంప ఛెళ్లుమనిపించేలా వ్యవహరించారు.ఇక తమ్ముడు చనిపోయిన మరసటి రోజే షూటింగ్ కి హాజరు కావడం వెనుక నిర్మాత ఇబ్బంది గురించి మాత్రమే గుర్తు చేసి తన ఎదుగుదల వెనుక ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పకనే చెప్పారు. ఇక ఎన్ని ఇబ్బందులున్నా భరత్ ని తాము ఎంతగా ప్రేమించామో చెప్పిన రవితేజ ఎంతో మందికి కనువిప్పు కలిగించారు.