రాయలసీమలో దారుణం.. ఆస్తి గొడవతో మరదలను నరికి చంపిన బావ

Affair with killing another husband for Lover ... Lover who killed

కరోనా కాలం.. లాక్ డౌన్ సడలింపులు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. తాజాగా అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాన్ని బలికొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది. ఆస్తి వివాదంతో చెలరేగిన గొడవ సొంత తమ్ముడి భార్యను మరదలని కూడా చూడకుండా గొడ్డలితో నరికి హతమార్చాడు. నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అంతా విస్తుపోయారు.

కాగా వెంటనే పోలీసులు సమాచారం తెలుసుకోగానే అప్రమత్తమ్యారు. పోలీసులు చెప్పిన విషయాలను బట్టి చూస్తే.. గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో చెలరేగిన గొడవ ఇద్దరి మధ్య వివాదాన్ని పెద్దది చేసింది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ, చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న గొడ్డలి తీసుకొని మరదలి మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో శ్రీలేఖ అక్కడికక్కడ కుప్పకూలిపోయింది. కాగా రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే శ్రీలేఖ మృతిచెందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయశేఖర్ వివరించారు.