Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డీమానిటైజేషన్ జరిగిన దగ్గర్నుంచి నోట్లంటే జనానికి కామెడీ అయిపోయింది. రెండు వేల నోటు రద్దవుతుందన్నారు. పది రూపాయల నాణం చెల్లదన్నారు. కొత్త యాభై రూపాయల నోటు వస్తే.. పాతది పనికిరాదన్నారు. ఇలా లేనిపోని ప్రచారాలు సృష్టించారు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు వెయ్యి రూపాయల నోటొస్తోందని సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు.
కానీ ఆర్బీఐ ఈ ప్రచారాల్ని ఖండించింది. అలాంటి విషయం ఉంటే తామే ముందు చెబుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే రెండొందల నోటు మార్కెట్లోకి వచ్చింది కాబట్టి.. చిల్లర సమస్య పెద్దగా లేదని చెబుతోంది కేంద్రం. అదీ నిజమే నోట్లు తగినంత సంఖ్యలో ఉంటే చిల్లర సమస్య ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదు. కానీ కొందరు పనిగట్టుకుని జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
ఈ సంగతి గ్రహించిన కేంద్రం స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే మార్కెట్లో కావల్సినన్ని వంద నోట్లు, ఐదొందల నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా జనానికి డీమానిటైజేషన్ తాలూకు ఫియర్ పోలేదు. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోనని చిల్లర ఉన్నా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిని కేంద్రమే పోగొట్టాలి. ఎక్కడపడితే అక్కడ విరివిగా వంద నోట్లు మార్కెట్ ను ముంచెత్తితే.. ఆటోమేటిగ్గా చిల్లర సమస్య పరిష్కారం అవుతుంది.
మరిన్ని వార్తలు: