గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీ ప్రమోషన్స్ సహా తన తదుపరి సినిమా లో గ్లోబల్ స్టార్ చురుగ్గా పాల్గొంటున్నాడు. మరి కొన్ని రోజులు కితమే యూఎస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన చరణ్ ఇపుడు బుచ్చిబాబు మూవీ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
మరి ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం షూటింగ్ మైసూరులో చేస్తున్నట్టుగా తాను తెలిపారు. అలాగే “రంగస్థలం” సినిమా తర్వాత చరణ్ తో కలిసి వర్క్ చెయ్యడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ తాను తెలిపారు. ఇక ఈ భారీ సినిమా కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
https://x.com/RathnaveluDop/status/1871628357009641822