ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ను రీటైన్ చేసుకుంది.
ఈ జట్టులో విరాట్ కోహ్లిను అత్యధికంగా 15 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ని 11 కోట్లు, మహ్మద్ సిరాజ్కు 7 కోట్లు వెచ్చించారు. కాగా ఐపీఎల్-2021 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.